ఆ మూవీ తరువాతే హనీమూన్ .. ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.. నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అర్జున్ సురవరం సినిమా హిట్ కావడంతో నిఖిల్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం, అనేక వాయిదాల అనంతరం రిలీజై హిట్ కొట్టడంతో నిఖిల్ తెగ సంబర పడిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి (డాక్టర్ పల్లవి)తో వివాహం ఫిక్స్ అవ్వడం, మరోవైపు కొత్త చిత్రాలను ప్రారంభించడం ఇలా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.
Recommended Video


వీకాఫ్ తీసుకుని పెళ్లి..
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో 18 Pages అనే ఓ చిత్రం, కార్తికేయ సీక్వెల్ ఇలా రెండింటిని ప్రారంభించేశాడు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నిఖిల్ తన పెళ్లి, హనీమూన్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. షూటింగ్ మధ్యలో వీకాఫ్ తీసుకుని మరీ పెళ్లి చేసుకుంటున్నానని తెలిపాడు.

హనీమూన్ వాయిదా..
బిజీ షెడ్యూల్‌ల వల్ల హనీమూన్‌ను కూడా వాయిదా వేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కార్తికేయ సీక్వెల్ షూటింగ్ పూర్తయ్యాక హనీమూన్ ప్లాన్ చేస్తానని తెలిపాడు. అంతవరకు సినిమాలతో బిజీగా ఉంటానని పేర్కొన్నాడు.

ఇంకా పవర్‌ఫుల్‌గా..
కార్తికేయ సీక్వెల్‌లో తన పాత్ర ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపాడు. అందులో స్వాతి పాత్ర అలాగే ఉంటుందని అయితే మరో హీరోయిన్ కూడా ఉంటుందని అన్నాడు. అది ఎవ్వరన్నది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు.

ఆరు నెలలు పరిశోధనలు చేశాం..
కార్తికేయ సీక్వెల్ షూటింగ్‌కు ప్రారంభానికి ముందు ఆరునెలలు పరిశోధనలు చేశామని చెప్పుకొచ్చాడు. కాంచీపురంలోని వరదరాజ పెరమాళ్ ఆలయం, ద్వారక, కోణార్క్, అనంత పద్మనాభస్వామి ఆలయాలను సందర్శించామని, వేదాల గురించి అధ్యయనం చేశామని తెలిపాడు.


Click it and Unblock the Notifications











