జీవితం ధన్యమైంది.. చిరు రిప్లైతో హీరో ఫుల్ ఖుషీ!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడం ఓ సెన్సేషన్ అయింది. వస్తూనే మొదటి రోజే ట్వీట్ల వర్షం కురిపించాడు. తన అభిమానులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌పై కామెంట్ చేస్తూ.. హల్చల్ చేశాడు.
ఇక నేడు ట్వీట్ల సునామిని సృష్టించాడు. సోషల్ మీడియాలో తన ఎంట్రీకి స్వాగతం పలికిన సెలెబ్రిటీలందరకీ వరుసగా రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కొందరికి ప్రత్యక్ష పంచ్‌లు, మరికొందరికి పరోక్షంగా కౌంటర్స్ పడ్డాయి. చిరు తన ట్వీట్లతో సోషల్ మీడియాలో తెగ సందడి చేశాడు. ఇన్నాళ్లు చిరు టైమింగ్‌ను చాలా మిస్ అయ్యామని నెటిజన్లు ఫీలవుతున్నారు.

చిరు ఎంట్రీని స్వాగతిస్తూ యంగ్ హీరో నిఖిల్ కూడా ట్వీట్ చేశాడు. ఓ మై గాడ్.. మెగాస్టార్ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. మా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సర్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు చిరు రిప్లై ఇస్తూ.. థాంక్యూ నిఖిల్ 'సురవరం' అంటూ రిప్లై ఇచ్చాడు. అర్జున్ సురవరం ఈవెంట్ సందర్భాన్ని గుర్తు చేసేట్టుగా ఇచ్చిన చిరు రిప్లైను చూసి.. మెగాస్టార్ రిప్లై ఆహా జీవితం ధన్యం.. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అంటూ తమ్ముడు సినిమాలోని ఓ సీన్‌ను నిఖిల్ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











