కార్తికేయ 2 స్టార్ట్.. ఆకట్టుకుంటోన్న కాన్సెప్ట్ పోస్టర్
స్వామిరారా సినిమాతో మంచి ఊపు మీదున్న హీరో నిఖిల్‌కు కార్తికేయ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఆ పై ఎక్కడికి పోతావు చిన్ని నాయనా అనే చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇలా జోరుమీద సాగుతున్న నిఖిల్ కెరీర్‌పై దెబ్బ మీద దెబ్బ పడింది. కేశవ, శంకరాభరణం, కిరాక్ పార్టీ వంటి ఫ్లాపులు వచ్చిపడ్డాయి.
అయితే చివరగా అర్జున్ సురవరం అంటూ ఓ తమిళ రీమేక్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇన్నాళ్లుగా వస్తున్న ఫ్లాపుల పరంపర నుంచి తప్పించుకుని.. సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇకపై ఆచితూచి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటానని, స్క్రిప్ట్ నచ్చకపోతే సినిమాలు చేయనని అందుకే శ్వాస అనే చిత్రాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చాడు.

నిఖిల్ కెరీర్‌లో నిలిచే పోయే చిత్రాలు స్వామిరారా, కార్తికేయ. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ వస్తాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో కార్తికేయ సీక్వెల్‌కు అడుగులు పడ్డాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని సీక్రెట్ చెప్పడానికి నేటి సాయంత్రం 4 గంటలకు ఓ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











