Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తొందరపడుతున్న నిఖిల్.. రేపే పెళ్లి చేసుకోబోతోన్న హీరో.. కారణం ఏంటంటే?
కరోనా వైరస్ ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపుతోంది. ఎంతో మందికి తినడానికి తిండి, ఉండటానికి గూడు లేకుండా చేసింది. ప్రపంచాన్ని తన కోరల్లో పట్టి పీడిస్తోంది. కరోనా వైరస్ ధాటిని నిలువరించేందుకు ప్రపంచే దేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. దీని మూలానా ఎన్నో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎన్నో యేళ్లుగా బ్యాచ్‌లర్ లైఫ్‌ను బతుకుతున్న నితిన్, నిఖిల్ వంటి హీరోలు ఓ ఇంటివారు కావాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ మూలానా అంతా మారిపోయింది. ఏది ఏమైనా తన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరని ఘంటాపథంగా చెప్పిన నిఖిల్ కూడా.. పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నిఖిల్ పెళ్లి రేపే జరగబోతోందని తెలుస్తోంది. అసలు ఏం జరగుతోందో ఓ సారి చూద్దాం.
ప్రేమ పెళ్లి..
నిఖిల్ తన ప్రేమ విషయాన్ని మొదటగా మంచు లక్ష్మీ షోలో ప్రకటించాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నామని, ఆమె ఓ డాక్టర్ అని, ఇంట్లో వారికి కూడా ఓకే అయిందని మొట్టమొదటి సారి బయటపడ్డాడు. ఇక అక్కడి నుంచి కాబోయే శ్రీమతిని ఎప్పుడు పరిచయం చేస్తాడా?అని అందరూ ఎదురుచూశారు.
నిశ్చితార్థం ఫోటోలు..
ప్రేమించిన అమ్మాయి, భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో పాపులర్ అయ్యాయి. ఏప్రిల్ 16వ తేదీని పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే లాక్ డౌన్ మొత్తం మార్చివేసింది.
ఎవ్వరూ ఆపలేరు..
కరోనా వైరస్ విజృంభిస్తూ పరిస్థితి ఆందోళన కరంగా ఉన్న సమయంలో.. నిఖిల్ మాట్లాడుతూ తన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరని చెప్పుకొచ్చాడు. అవసరమైతే గుడిలోనైనా పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు .కానీ తీరా చూస్తే.. ఆ ఆలోచనను కూడా మార్చుకున్నాడు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నిఖిల్ పెళ్లి రేపే అని తెలుస్తోంది.
పరిమిత సంఖ్యలో ఆప్తులు..
పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో దిల్ రాజు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే, ఈ మాధిరిగా లాక్ డౌన్ నిబంధనలను అనుసరిస్తూ.. హైదరాబాద్ శివారులోని ఒక ఫాం హౌస్‌లో పెళ్లి జరుగుతుందని సమాచారం. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులను చేసే కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లోనే జరుగుతాయట. మంచి ముహూర్తాలు లేకపోవడంతో రేపే పెళ్లి చేసుకుంటున్నాడని తెలుస్తోంది.