సుకుమార్ కథతో నిఖిల్.. మరో హిట్ గ్యారెంటీ
విభిన్న కథలను ఎంచుకుంటూ.. ప్రతీ సినిమా కొత్తగా ఉండేలా చూసుకునే హీరో నిఖిల్. ఆ మధ్య కన్నడ రీమేక్ కిరాక్ పార్టీ అంటూ చేసి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా.. తాజాగా తమిళ రీమేక్ అర్జున్ సురవరంతో మంచి హిట్ అందుకున్నాడు. రిలీజ్‌కు ముందు ఎన్నో కష్టాలు చవిచూసిన అర్జున్ సురవరం.. మొత్తానికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.
వివాదాల్లో చిక్కుకుని, పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న అర్జున్ సురవరం చిత్రాన్ని తలుచుకుని ఎన్నోసార్లు భయపడ్డానని చెప్పుకొచ్చిన హీరోకు.. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికేట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో దర్శకుడు టీ సంతోష్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంటోంది.

తన చేతిలో ప్రస్తుతం ఓ మూడు చిత్రాలున్నాయని మూవీ ప్రమోషన్స్‌లో చెప్పిన నిఖిల్.. అందులో ఓ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించబోతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను సుకుమార్ అందించగా.. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.



Click it and Unblock the Notifications











