Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సందీప్ కిషన్ సీక్రెట్ చెప్పిన నిఖిల్.. విదేశాల్లో మనోడి రచ్చ! ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేదు
సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించాడు సందీప్ కిషన్. జులై 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్బంగా హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకకు హాజరైన యంగ్ హీరో నిఖిల్ సందీప్ కిషన్ గురించి చాలా ఆసక్తిగా మాట్లాడి ప్రేక్షకుల్లో హుషారు తెప్పించాడు. అంతేకాదు మనోడి సీక్రెట్ కూడా బయటపెట్టేశాడు. ఇంతకీ నిఖిల్ చెప్పిన ఆ సంగతులేంటి? వివరాల్లోకి పోతే..
ఇంటి నుంచి బయటికి కూడా వచ్చే పరిస్థితి లేదు
వేదిక మీదకు వచ్చిన నిఖిల్ ముందుగా ప్రేక్షకులకు సారీ చెబుతూ తన స్పీచ్ మొదలు పెట్టాడు. తనకు ప్రస్తుతం ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని, అలాగే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేదని నిఖిల్ అన్నాడు. దానికి కారణం తన సినిమా ఎప్పుడు ఎప్పుడు అని అందరూ అడుగుతుండటమే.. అని చెప్పాడు. అయితే ప్రభాస్ 'సాహూ' విడుదలయ్యాక కొద్దీ రోజులకే తన సినిమా రిలీజ్ అవుతుందని నిఖిల్ చెప్పాడు.
సందీప్ కిషన్ గురించి చాలా చెప్పాలి
సందీప్ కిషన్ నేను అసలు మాట్లాడుకునే వాళ్లమే కాదు.. కానీ అతనితో ఒకసారి మాట్లాడితే అసలు మాటలు ఆగడం లేదు. సాధారణంగా ఆడియో ఫంక్షన్స్ కి రావడమంటే నాకు భయం. కానీ ఈ ఈవెంట్‌కి నేనే సందీప్ కిషన్‌కి ఫోన్ చేసి మరీ వస్తానని చెప్పాను. నిను వీడని నీడను నేనే సినిమా బాగుందని అందరూ అంటుంటే నేను కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతానని అడిగాను. బట్ నాకు ఆ ఛాన్స్ దక్కలేదు అని నిఖిల్ అన్నాడు.
విదేశాల్లో మనోడి రచ్చ
ఇక సందీప్ కిషన్ గురించి ఓ సీక్రెట్ చెప్పాలి అంటూ తాము సౌత్ ఆఫ్రికా వెళ్లినప్పటి సంగతి చెప్పాడు నిఖిల్. అక్కడ సందీప్ మాములుగా రచ్చ చేయలేదని అన్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అక్కడే చూశాను. సూపర్ గా ఉంది. లైఫ్ అన్నాక ఒడిదొడుకులు ఉంటాయి. ఇప్పుడు సందీప్ కిషన్ రైజ్ అయ్యే టైమ్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని నిఖిల్ అన్నాడు.
నిను వీడని నీడను నేనే మూవీ
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. అన్యా సింగ్ హీరోయిన్. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు.
నిఖిల్ అర్జున్ సురవరం
నిఖిల్ హీరోగా రాబోతున్న 'అర్జున్ సురవరం' సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో హీరో నిఖిల్ నటించాడు. మే 1 వ తేదీనే విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.