నువ్ వచ్చావ్ సంతోషాన్ని తెచ్చావ్.. శ్రీమతి బర్త్ డేపై నిఖిల్ కామెంట్స్

హీరో నిఖిల్ సిద్దార్థ్ మొత్తానికి ఓ ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపేస్తున్నాడు. పెళ్లి విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడినా మొత్తానికి కరోనాను ఎదుర్కొని, లాక్ డౌన్, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌ సమీపంలోని షామీర్ పేటలోని రిసార్టులో మే 14 ఉదయం 6.31 గంటల సుముహుర్తానికి నిఖిల్, పల్లవి జంట ఒక్కటైంది.

నేడు (సెప్టెంబర్ 3) పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా శ్రీమతికి స్పెషల్‌గా విషెస్ చెప్పాడు. ఈ మేరకు పాత ఫోటోను షేర్ చేస్తూ.. భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఈ మేరకు నిఖిల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. హ్యాపీ బర్త్ డే వైఫీ.. నువ్ ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి అంతా ఆనందమయంగానే ఉంది అంటూ నిఖిల్ ప్రేమ కురిపించాడు. ఇక నిఖిల్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే.

Nikhil Siddharth Special Birthday Wishes To Pallavi Varma

తనను బాగా అర్థం చేసుకుంటుందని, ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రశ్నలు అడగదని, అడ్డు చెప్పదని, ఎంతో మంచిదని భార్యపై నిఖిల్ ప్రేమ కురిపించాడు. ఇక నిఖిల్.. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో జిమ్ చేస్తూ తెగ కష్టపడిపోతున్నాడు. నిఖిల్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నాడు. కార్తికేయ 2, 18 పేజీలు అనే ప్రాజెక్ట్‌లతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. చివరగా అర్జున్ సురవరం అంటూ సూపర్ హిట్టు కొట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X