twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ అవుతున్న 'విత్ పీకే'.. పవన్ నీ వెంటే నేను అంటున్న యంగ్ హీరో

    |

    భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. సమాజంలో అవినీతి పుట్టలు పుట్టలుగా పెరుగుతోందని, దాన్ని చిదిమేసేందుకే తాను జనసేనానిగా మీ ముందుకొస్తున్నాని ప్రకటించారు పవన్. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీ స్థాపించి.. పోటీలో లేకుండా కేవలం ప్రచారాలు చేశారు. జనసేన పార్టీ పేరు ప్రజల్లోకి వెళ్ళాక అప్పుడు పోటీకి దిగారు. గ్లాస్ గుర్తుతో ఆయన ప్రారంభించిన ప్రస్థానానికి ఆదిలోకే చుక్కెదురైంది. పవన్ కళ్యాణ్ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోలేదు. 2019 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ని, ఆయన పార్టీ అభ్యర్థులందరినీ చిత్తుగా ఓడించారు.

    దీంతో పవన్ కళ్యాణ్, ఆయన అభిమాన వర్గమంతా షాకయ్యింది. ఏపిలో జనసేన ప్రభంజనం భారీ ఎత్తున ఉంటుందని ఊహించిన మెగా వర్గానికి కోలుకోలేని దెబ్బ పడింది. ప్రచారంలో పవన్ డెడికేషన్, నాగబాబు యూ ట్యూబ్ టెక్నీక్స్ ఇవేవీ జనసేన పార్టీని కాపాడలేక పోయాయి. దారుణమైన పరాభవం ఎదురవడంతో మెగా ఫ్యామిలీతో పాటు పవన్ అభిమాన వర్గాలు కరవరపడ్డాయి. పవన్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చవిచూడగా.. నాగబాబు ఎంపీ ఆశలు ఆవిరయ్యాయి. ఒక్క రాజోలు మినహాయిస్తే జనసేన ఎక్కడా జనం లోకి వెళ్లలేక పోయింది. దీంతో నిరాశ చెందిన పవన్ వర్గానికి సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ పలుకుతున్నారు.

     Nikhil Siddharth tweets on JanaSena Party

    'విత్ పీకే' అనే హాష్ ట్యాగ్‌తో జనసేనకు తమ వంతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విత్ పీకే హ్యాష్‌ట్యాగ్‌ ట్వీట్లతో జనసేన కేడర్‌లోనూ, అధినేత పవన్ లోనూ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పవన్ నీ వెంటే మేముంటాం అంటూ పెద్ద ఎత్తున మెసేజీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అడుగు ఎప్పుడూ ఒకటి తోనే మొదలవుతుందని, రాజోలు గెలుపు భవిష్యత్‌కి పునాది.. అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.

    English summary
    Young hero Nikhil Siddharth supports pawan kalyan janasena party. He posted a tweet regarding janasena performance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X