Spy Trailer: స్వాతంత్ర్యం అంటే ఒకరు ఇచ్చేది కాదు లాక్కునేది…ఇంటెన్సివ్ గా స్పై ట్రైలర్
యంగ్ హీరో నిఖిల్ ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టాడు. తరువాత 18 పేజెస్ మూవీతో తెలుగులో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల ఆఖరున రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెగ్యులర్ స్పై థ్రిల్లర్ కథల తరహాలో కాకుండా ఈ మూవీలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని నేతాజీ డెత్ మిస్టరీ పాయింట్ ని తీసుకొని తెరకెక్కించారు. అందులో ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇక ట్రైలర్ లోకి వెళ్తే చరిత్ర ఎప్పుడు మనకి నిజం చెప్పదు... దాస్తుంది. దానికి మనమే సమాధానం వెతకాలి అనే డైలాగ్ తో స్టార్ట్ చేశారు.
తరువాత ఖదీర్ అనే టెర్రరిస్ట్ మీదకి కంటెంట్ ని తీసుకొని వెళ్ళారు. అతని చంపేసిన ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు అనే డైలాగ్ తో నడిపించగా ఖాదీర్ పాత్ర ప్రెజెంట్ చేశారు. తరువాత నేతాజీ ఫైల్స్ తో ఖదీర్ ఏం చేస్తాడు. అని అభినవ్ గోమటం డైలాగ్ చెప్పగా ఖదీర్ ఒక వాయిస్ లాంటి వాడు అని పై ఆఫీసర్ చెబుతాడు. తరువాత జై పాత్ర ఒక మిషన్ స్టార్ట్ చేయడం. అందులో భాగంగా తన అన్న సుభాష్ ని చంపిన వారిని పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాడు.
ఈ ఎలివేషన్ లో యాక్షన్స్ సీక్వెన్స్ ని ప్రెజెంట్ చేశారు. తరువాత హీరోయిన్ పాత్రని పరిచయం చేశారు. తనతో ఇష్టం లేకుండానే జై ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఏదో సీక్రెట్ మిషన్ చేస్తున్నాడు అనే పోటింగ్ ని ఎలివేట్ చేశారు. ఇక ట్రైలర్ ఎండ్ లో స్వాతంత్ర్యం అంటే ఒకరు ఇచ్చేది కాదు. లాక్కునేది... ఈ మాట నేను చెప్పలేదు. నేతాజీ చెప్పాడు అని రానా ఫైలట్ సీట్ లో కూర్చొని డైలాగ్ చెప్పడంతో ముగించారు.

ఓవరాల్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, యాక్షన్, డ్రామా మిక్స్ అయిన స్పై ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. మరి ఈ కథలో నేతాజీ డేట్ మిస్టరీని, తన అన్న మరణానికి కారణాన్ని నిఖిల్ ఎలా తెలుసుకున్నాడు అనేది కథగా ఉందనిపిస్తోంది. నిఖిల్ అన్నగా ఆర్యన్ రాజేష్ కనిపిస్తున్నాడు. ఐశ్వర్య మీనన్ తో పాటు మరో హీరోయిన్ కూడా మూవీలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా దర్శకుడు గ్యారీ ట్రైలర్ తో స్పై మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అయితే పెంచగలిగారు. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











