కుక్క ఎంత మోరిగినా శిఖరం తల తిప్పి చూడదు.. RGVకి నిఖిల్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఇష్టా రాజ్యంగా సినిమాలు తీస్తూ పవర్ స్టార్ ఇమేజ్ పై గట్టి దెబ్బె కొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఎంతగానో గౌరవిస్తారు. అయితే ఇప్పుడు ఆర్జీవి ఆయనను కించ పరిచే విధంగా సినిమా చేస్తుంటే ఎవరు నోరు మెడపడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక చివరికి యువ హీరో నిఖిల్ ఆర్జీవికి ఊహించని విధంగా ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు.

Recommended Video

Hero Nikhil Strong Punch To RGV || శిఖరాన్ని చూసి కుక్క మొరిగినా..!! || Oneindia Telugu
చాలా తెలివిగా..

చాలా తెలివిగా..

ఎలక్షన్స్ తరువాత జరిగిన పరిస్థితులు ఏమిటనే కాన్సెప్ట్ తో పవర్ స్టార్ ను రూపొందించిన ఆర్జీవి చాలా తెలివిగా సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా జాగ్రత్త పడుతూ కాంట్రవర్సీ పాయింట్స్ ని క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ విషయంపై ఓ వర్గం అభిమానులు మండిపడుతున్నా సినీ తారలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు.

 RGVకి నికిల్ ఇన్ డైరెక్ట్ కౌంటర్

RGVకి నికిల్ ఇన్ డైరెక్ట్ కౌంటర్

ఇక చివరికి యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తూ ఆర్జీవికి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా ఆర్జీవి పేరు కూడా తీయకుండా అభిమాన హీరోకు మద్దతు ఇచ్చాడు. శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా..ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా అంటూ నిఖిల్ తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూడా అతనికి మద్దతు ఇస్తున్నారు.

 పవర్ స్టార్ కి మద్దతు ఇస్తూ..

పవర్ స్టార్ కి మద్దతు ఇస్తూ..

చాలా సందర్భాల్లో నిఖిల్ కూడా తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అంటూ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్జీవి ఇష్టం ఉన్నట్లుగా ఆయనపై సెటైర్స్ వేస్తుండడంతో నిఖిల్ కూడా చాలా తెలివిగ స్పందించిన తీరుకు మెగా అభిమానులు ఫిదా అయ్యారు. గతంలో కూడా చాలా సార్లు నిఖిల్ పవర్ స్టార్ కి మద్దతు ఇస్తూ.. విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఎంత రెచ్చిపోతే అంత లాభం

ఎంత రెచ్చిపోతే అంత లాభం

ఇక రామ్ గోపాల్ వర్మ అభిమానులు ఎంత రెచ్చిపోతే అంత లాభం అన్నట్లుగా ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. అదే విధంగా కొన్ని ప్రమోషన్స్ స్టంట్స్ కూడా వేస్తున్నాడు. ట్రైలర్ లీక్ అయ్యింది అంటూ ఫ్రీగా యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ట్రైలర్ కోసం డబ్బులు కట్టిన వారికి మళ్ళీ వెనక్కి ఇవ్వనున్నట్లు కూడా వివరణ ఇచ్చిన ఆర్జీవి మొత్తంగా సినిమా ఎలాగైనా హైలెట్ కావాలని డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X