నిఖిల్‌తో అనుపమ రొమాన్స్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!

అర్జున్ సురవరం చిత్రంతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు నిఖిల్. అంతకు ముందు కిర్రాక్ పార్టీ అంటూ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. శంకరాభరణం, కేశవ వంటి చిత్రాలు కూడా మెప్పించలేకపోయాయి. కానీ ఎన్నో వాయిదాల తరువాత విడుదలైన అర్జున్ సురవరం మంచి హిట్ అవ్వడంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాడు.

మధ్యలో శ్వాస అనే చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ అది అటకెక్కింది. కార్తికేయ సీక్వెల్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఇది కాకుండా గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న 18 Pages అనే చిత్రాన్ని కూడా ఓకే చేశాడు. మామూలుగా అయితే కరోనా లాక్ డౌన్ వంటివి రాకపోతే ఈపాటికే థియేటర్లలో సందడి చేసేవాడు. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. కానీ ఇక స్పీడ్ పెంచే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది.

Nikhil To Romance With Anupama Parameswaran In 18 Pages

కుమార్ 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ తాజాగా ప్రకటించారు. నిఖిల్ సరసన ఈ మూవీలో అనుపమ నటించనుందని తెలిపారు. అనుపమ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని తెలిపింది. మామూలుగా అయితే హలో గురు ప్రేమ కోసమే చిత్రం తరువాత అనుపమకు ఇంత వరకు ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా చేతిలో పడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X