నిజమైన దెయ్యాన్ని చూసిన సీరియల్ హీరోయిన్.. తొలిసారి రివీల్.. ఎవరు, ఎక్కడంటే?
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా అందులో అరుంధతీగా, ఆత్మగా కనిపిస్తున్న పల్లవి గౌడ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్బుతమైన అందం, అంతకు మించిన నటనతో అదరగొడుతూ.. లక్షలాది మంది అభిమానుల్ని సంపాధించుకుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ వెళ్తోంది.
2010లో ఈటీవీ కన్నడలో మనె ఓండు మూరు బాగిలు అనే సీరియల్ లో నటించింది. ఆతర్వాత జీ తెలుగులో పసుపు కుంకుమ సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అలాగే సావిత్రి, చదరంగం, సూర్యకాంతం, నిండు నూరేళ్ల సావాసం సీరియల్స్ లో నటించి మెప్పిస్తోంది. ఇవే కాకుండా కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం, జోడీ హక్కీ, సెవంతి డాన్స్ కర్ణాటక డాన్స్ ఫ్యామిలీ వార్ సీజన్ 2 షోలోనూ పాల్గొంది. అలాగే అల్లియంబాల్, దయ.. చెంతేయిల్ చలిక కుంకుమపొట్టు అనే మలయాళ సీరియల్స్ కూడా నటిస్తోంది.

ఇలా వరుసగా సీరియల్స్ లో నటిస్తూ పుల్ బిజీగా ఉన్న ఈమె కన్నడలో ప్రేమ గీమా జేన్, కిడి, నామ్ గాని బి.కామ్ పాస్, కోడెమురుగ, పంక్చర్ అనే కన్నడ సినిమాల్లోనూ కనిపించింది. అలాగే 2 స్టేస్ట్, అమ్మ అవకాయ్ అంజలి అనే వెబ్ సిరీస్ లలో కూడా మెరిసింది. ఇలా సీరియల్స్ లో వరుసగా దూసుకుపోతున్న పల్లవి గౌడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలోనే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురించి మాట్లాడుతూ.. చాలా బాగా అనిపిస్తోందని చెప్పింది. మీరు ఈ సీరియల్ లో ఆత్మగా కనిపిస్తున్నారు కదా మీరు దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా అంటూ హోస్ట్ ప్రశ్నించాడు.
అందుకు పల్లవి గౌడ ఎవరూ ఊహించని షాకిచ్చే సమాధానాలు చెప్పింది. తాను దేవుడు, దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని నమ్ముతాని.. నిజానికి తాను నిజ జీవితంలో దెయ్యాన్ని కూడా చూశానని పేర్కొంది. ఓ సీరియల్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఓ గెస్ట్ హౌస్ లో ఉండాల్సి వచ్చిందని.. తనతో పాటు తన తల్లి, మరో నటి కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే అర్ధరాత్రి షూటింగ్ ఉండడంతో వాళ్లు గెస్ట్ హౌస్ కు వెళ్లేసరికి రాత్రి 3 గంటలు అయిందని చెప్పింది. ఇంటికి వెళ్లి తలుపులు తీయగానే తనకు నీడ లాంటి ఓ ఆకారం కనిపించిందని తెలిపింది.

అది చూసిన వెంటనే తనకు చాలా భయం వేసిందని.. కానీ పక్కనే ఉన్న తల్లి, మరో నటి మాట్లాడుతూ దాన్ని చూడలేరని.. కానీ చెబితే వాళ్లు భయపడతారని సైలెంట్ గా ఉండిపోయినట్లు పేర్కొంది. అది మనిషి లాంటి ఓ రూపం అని.. ఎవరైనా వచ్చారేమోనని ఇంట్లో చూస్తే ఎవరు లేరని.. అప్పుడే తనకు అది దెయ్యం అని అర్థం అయింది పల్లవి గౌడ వివరించింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. చాలా మంది నిజమైన దెయ్యాన్ని చూశారా అంటూ ఆమెను ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











