సెన్సార్ ఊరట.. జులై 12న తేలనున్న సందీప్ కిషన్ భవితవ్యం!
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. అన్యా సింగ్ హీరోయిన్. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు.
జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ చిత్రంపై సందీప్ కిషన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతం అవుతున్న ఈ యంగ్ హీరో.... తాను సినిమా రంగంలో సంపాదించిన డబ్బు మొత్తం తెచ్చి ఇందులో పెట్టుబడిగా పెట్టారు. ఈ సినిమా రిజల్ట్ మీదనే సందీప్ కిషన్ భవితవ్యం ఆధారపడి ఉందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రానికి 'U/A' రావడం ఊరట కలిగించే అంశం.
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాకరన్, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్, దర్శకుడు: కార్తీక్ రాజు.


Click it and Unblock the Notifications











