ఆసక్తి రేపుతున్న సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ టీజర్
తెలుగు యువ హీరో సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా థ్రిల్లర్, హారర్ కాన్సెప్టుతో రూపొందుతున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆసక్తి రేపే విధంగా డిజైన్ చేశారు. రొమాంటిక్ టచ్ ఇస్తూనే... సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ జోడించి ఉత్కంఠ భరితంగా సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. కథ మొత్తం ఒక ఆత్మ చుట్టూ ఉంటుందని, ఆత్మగా వెన్నెల కిషోర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 2013లో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో సినిమా ఉండబోతోంది.

సైన్స్‌కు మించి ఆలోచింపజేసిన కేసు ఇది అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. తను నా రిషి కాదు డాక్టర్... చూడాలంటేనే భయంగా ఉంది అంటూ హీరోయిన్ చెప్పడం బట్టి... ఆత్మ హీరోను ఆవిహించిన తర్వాత వచ్చే ట్విస్టులతో కథ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు స్పష్టం చేస్తోంది.
ఈ సినిమా ద్వారా సందీప్ కిషన్ తొలిసారి నిర్మాతగా మారాడు. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వాముగా ఉన్నాయి. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి.
ఈ చిత్రంలో సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిషోర్, పోసానీ కృష్ణ మరళి, మురళీ శర్మ, పూర్ణిమా భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కథ, దర్శకత్వం: కార్తీక్ రాజు
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్: ప్రవీన్ కెఎల్
ఆర్ట: విదేష్
స్టంట్స్: వెంకట్
నిర్మాతలు: దయా పన్నెమ్, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థలు: వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్


Click it and Unblock the Notifications











