twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు.. ఆచార్య ప్రొడ్యూసర్‌కుె వైఎస్ జగన్ బంపర్ ఆఫర్

    |

    సినీ రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినీరంగంలో సత్తాచాటిన వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సత్తా చాటిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలో సినీ నిర్మాత, లాయర్ నిరంజన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అధికార వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధికారిక ప్రకటన చేసింది ఆ వివరాల్లోకి వెళితే

    సీనీ రంగంలోకి ప్రవేశం

    సీనీ రంగంలోకి ప్రవేశం

    లాయర్ గా తన కెరీర్ ప్రారంభించిన కాటేపల్లి నిరంజన్ రెడ్డి చిన్ననాటి నుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారు. అందులో భాగంగా తమ జిల్లా వాడే అయిన దిల్ రాజుతో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ప్రారంభించారు. తొలుత డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం 2002వ సంవత్సరంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనేక సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత సినీ నిర్మాణంలోకి కూడా దిగారు.

    జగన్ కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి

    జగన్ కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి

    అయితే ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క లాయర్ గా కూడా తన వృత్తిని కొనసాగించారు నిరంజన్ రెడ్డి. అందులో భాగంగా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదయిన అక్రమాస్తుల కేసును సుప్రీంకోర్టులో కూడా వాదించారు. ఈ నేపథ్యంలో ఆయనకు జగన్మోహన్ రెడ్డికి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఒకపక్క న్యాయవాదిగా కొనసాగుతూనే మరోపక్క తన సోదరుడు అన్వేష్ రెడ్డి సాయంతో ఆయన సినీ నిర్మాణం చేయడం ప్రారంభించారు.

    టికెట్ల రేట్ల వివాదం సమయంలో జగన్‌తో భేటీ సమయంలో కీలకంగా

    టికెట్ల రేట్ల వివాదం సమయంలో జగన్‌తో భేటీ సమయంలో కీలకంగా

    తొలుత మరో చరిత్ర అనే సినిమాకు సహా నిర్మాతగా తమ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి నుంచి గగనం, క్షణం, ఘాజీ, రాజుగారి గది 2, ఆచార్య, వైల్డ్ డాగ్, అర్జున ఫల్గుణ, మిషన్ ఇంపాజిబుల్ వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు తగ్గించిన సమయంలో ఆయన ఆచార్య సినిమా నిర్మాణంలో తలమునకలై ఉన్నారు.
    కానీ సినీ పరిశ్రమ మొత్తానికి పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఈ విషయం మీద ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కూర్చుంటే నిరంజన్ రెడ్డి జగన్ తో భేటీ అయ్యేందుకు సహకరించారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జగన్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో జగన్ భేటీ అయ్యేందుకు నిరంజన్ రెడ్డి కోరడంతో జగన్ కూడా నిరంజన్ రెడ్డితో తన సాన్నిహిత్యంతో చిరంజీవిని కలిసేందుకు ఒప్పుకున్నారు. .

    సినీతారలతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో సఫలీకృతం..

    సినీతారలతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో సఫలీకృతం..


    ఇక టికెట్ రేట్ల వివాదం సమయంలో జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యే విషయంలో కూడా నిరంజన్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిరంజీవి ఒకసారి భేటీ అయిన తర్వాత ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ వంటి వారిని అమరావతి తీసుకువెళ్లి అనేక సమస్యలను జగన్ దృష్టికి తీసుకు వెళ్లడం వంటి విషయాల్లో కూడా నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

    టికెట్ రేట్లు పెంచుకొనే విషయంలో కీలకంగా

    టికెట్ రేట్లు పెంచుకొనే విషయంలో కీలకంగా

    ఆ భేటీ సమయంలో కూడా నిరంజన్ రెడ్డి గురించి కీలక చర్చ జరిగింది. అప్పట్లో ఇదే విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. ఇక సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో కూడా నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక త్వరలోనే ఆయన రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు ఇక ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    English summary
    acharya producer Niranjan Reddy confirmed as Rabhya Sabha candidate from YSRCP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X