twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిశ్శబ్దం ట్రైలర్: పాడుబడ్డ ఇంట్లో అనుష్క.. వెరీ ఇంట్రెస్టింగ్

    |

    చాలా రోజుల తర్వాత అనుష్క తిరిగి వెండితెరపై కనిపించబోతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషిస్తోంది. ఫిలింఫ్యాక్టరీ- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మాతలు. చిత్రంలో మాధవన్, అంజలి ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

    ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. ఇప్పటికే పలు పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఇక తాజాగా 'నిశ్శబ్దం' ట్రైలర్ ద్వారా ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది.

    నాని చేతుల మీదుగా..

    నిశ్శబ్దం తెలుగు ట్రైల‌ర్‌ను నేడు (శుక్ర‌వారం) నేచురల్ స్టార్ నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ మేరకు ''ఇదిగో.. మా స్వీటెస్ట్ స్వీటీ ‘నిశ్శ‌బ్దం' ట్రైలర్. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు'' అని పేర్కొంటూ చిత్ర యూనిట్‌కి నాని శుభాకాంక్ష‌లు తెలిపారు నాని.

    నిశ్శబ్దం ట్రైలర్ చూస్తుంటే..

    నిశ్శబ్దం ట్రైలర్ చూస్తుంటే..

    ఇకపోతే ఒక నిమిషం 25 సెకనుల నిడివితో కూడా ఈ నిశ్శబ్దం ట్రైలర్ చూస్తుంటే.. నాని చెప్పినట్లుగానే నిశ్శబ్దం మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ట్రైలర్‌లో చూపించిన ప్రతీ సన్నివేశం సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

    పాడుబ‌డిన ఇంట్లో అనుష్క‌, మాధ‌వ‌న్

    పాడుబ‌డిన ఇంట్లో అనుష్క‌, మాధ‌వ‌న్

    ‘అక్క‌డ చీక‌ట్లో ఎవ‌రో ఎటాక్ చేశారంట.. కానీ ఎవ‌రో ఏంటో క‌నిపించ‌లేదంటున్నారు' అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఓ పాడుబ‌డిన ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌వ‌న్ లను చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. అనుష్క‌, మాధ‌వ‌న్ కొన్ని భ‌యాన‌క‌ దృశ్యాలను చూస్తారు. దీంతో అస‌లు ఆ ఇంట్లో ఏముందని పోలీసుల అన్వేష‌ణ‌ తాలూకు సన్నివేశాలు చూపిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు.

    Recommended Video

    Anushka Shetty Open Up On Dating A Cricketer | Filmibeat Telugu

    అంజ‌లి రోల్.. అది ఖాయమే

    హీరోయిన్ అంజ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కినిపించింది. అనుష్క మాట‌లు మాట్లాడ‌లేని, చెవులు విన‌ప‌డ‌ని బ‌ధిర అమ్మాయి సాక్షిగా ఆకట్టుకుంది. త‌న సైగ‌ల‌తో అంజ‌లికి ఏదో చెప్ప‌డానికి అనుష్క ప్రయత్నిస్తుండటం చూపించి రక్తి కట్టించారు. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే నిశ్శబ్దం మూవీ ఓ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని, సీట్ ఎడ్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమని తెలుస్తోంది.

    English summary
    After long gap of Bhagamathi Anushka starts a new movie Nishabdam. This movie trailer released just now and going through record views.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X