Just In
- 47 min ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 1 hr ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- 11 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 12 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- Sports
ISL 2020-21: హైదరాబాద్‌కు మరో డ్రా!
- News
బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భీష్మ టీజర్.. మిలియన్ వ్యూస్ క్రాస్ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్
శ్రీనివాస కళ్యాణం సినిమాతో బోల్తా పడ్డ హీరో నితిన్. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఆ చిత్రం తనకు కొత్త ఇమేజ్‌ను తీసుకువస్తుందని ఆశిస్తే బెడిసి కొట్టింది. చల్ మోహనరంగ చిత్రమైనా తనకు కలిసి వస్తుందంటే అది హ్యాండిచ్చింది. ఇలా వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న నితిన్‌కు మాత్రం అదిరిపోయే ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ కుడుములతో భీష్మ, వెంకీ అట్లూరితో రంగ్‌దే ఇలా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే భీష్మ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్సెస్, సింగిల్ ఆంథమ్ ఎంతగానో వైరల్ అయి సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా.. తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు నితిన్. భీష్మ టీజర్ వదిలి అందర్నీ ఖుషీ చేశాడు.

రష్మిక-నితిన్ మధ్య కెమెస్ట్రీ హైలెట్‌గా నిలవనున్నట్టు తెలుస్తోన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వన్ మిలియన్ క్రాస్ చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఫిబ్రవరి 21న భీష్మ విడుదల కానుంది.