భీష్మకు బై బై చెప్పేసిన రష్మిక.. ఇక బన్నీతోనే అంతా!
నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన మాస్ సాంగ్ 'వాట్ యే బ్యూటీ' వీడియో ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఈ సాంగ్‌లో రష్మిక డ్యాన్స్ ఆకట్టుకోగా.. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతున్న భీష్మ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న రష్మిక మందన్న తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేసి భీష్మకు బై బై చెప్పేసింది. డబ్బింగ్ చాలా బాగా వచ్చిందని పేర్కొంటూ మీరంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని తెలిపింది రష్మిక. ఇక ఈమె అల్లు అర్జున్- సుకుమార్ సెట్స్‌పై బిజీ కానుంది.
ఇక ఇప్పటికే విడుదలైన భీష్మ టీజర్.. నితిన్, రష్మికల మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పింది. ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. చూడాలి మరి ఈ భీష్మ సందడి ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో!.


Click it and Unblock the Notifications











