నితిన్ బర్త్ డే స్పెషల్: 'రంగ్ దే' న్యూ పోస్టర్.. ఆకట్టుకుంటున్న హీరోహీరోయిన్
నేడు (మార్చి 30) హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చేస్బుతూ 'రంగ్ దే' న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్ ద్వారా అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) లను మరోసారి ప్రేక్షకుల ముందుంచారు. నితిన్ బర్త్ డే కానుకగా నిన్న (మార్చి 29)నే 'రంగ్ దే' మోషన్ పోస్టర్, రొమాంటిక్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన టీమ్.. మరోసారి ఈ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసింది.
తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్, నితిన్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. హ్యాపీ బర్త్ డే నితిన్ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ చూసి తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ ఏడాది 'భీష్మ' అంటూ హంగామా షురూ చేసిన నితిన్.. 'రంగ్ దే' సినిమాతో మరో సక్సెస్ చేజిక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

మార్చి ఎండింగ్ నుంచి 'రంగ్ దే' హంగామా స్టార్ట్ కానుందని, అప్పటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తామని గతంలోనే ప్రకటించిన చిత్రయూనిట్ చెప్పినట్లుగానే చేస్తోంది. హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో ఇది 29వ సినిమా.


Click it and Unblock the Notifications











