400 కోట్లు సాధించిన హిందీ మూవీ రీమేక్‌లో నితిన్.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు
బాలీవుడ్‌లో అంధాధూన్ చిత్రం సంచలన విజయం సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ బడ్జెట్, స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వసూళ్లను సాధించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే, టబు కీలక పాత్రలు పోషించారు. 32 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.456 కోట్ల వసూళ్లను సాధించింది. చైనాలో విడుదల చేయగా సుమారు రూ.300 కోట్లు రాబట్టింది. అలాంటి సినిమా హక్కులను హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి చేజిక్కించుకొన్నారు.
2018లో హిందీలో అతిపెద్ద విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఆయుష్మాన్ ఖురానా పాత్రలో నితిన్ నటించనున్నారు. అంధుడి పాత్రలో నితిన్ విలక్షణమైన నటనను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల సమాచారం. హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన పియానిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

త్వరలోనే అంధాధూన్ సినిమా రీమేక్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కులను సుధాకర్ రెడ్డి సొంతం చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











