అదరగొట్టేసి చెక్ ట్రైలర్.. నితిన్‌కు మరో హిట్ గ్యారెంటీ!
నితిన్ చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తోన్న చెక్ సినిమాపై మంచి అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. టైటిల్ అండ్ పోస్టర్ రిలీజ్ చేయడంతోనే హైప్ పెరిగింది. చంద్రశేఖర్ యేలేటి సినిమాలంటే అందరికీ ఓ అంచనాలుంటాయి. విభిన్న కథ కథనాలతో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగించేలా తెరకెక్కిస్తుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన చెక్ ట్రైలర్ చూస్తే కూడా చంద్రశేఖర్ యేలేటి మార్క్ కనిపిస్తుంది.
చెక్ సినిమా మొత్తం చదరంగం చుట్టే తిరిగేలా కనిపిస్తోంది. నితిన్ మంచి చెప్ ఆటగాడు... అయితే టెర్రరిస్ట్‌గా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఏనుగు గురించి చెబుతూ దీని దారి రహదారి దీనికి ఎదురుగా వెళ్లాలంటే దమ్ము కావాలి అని చెప్పే డైలాగ్.. ఒంటె గురించి చెబుతూ.. దీనిపై ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచాలంటూ చెప్పే కొన్ని డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మొత్తానికి ఆ చదరంగం, జైలు, దేశ ద్రోహం కేసు ఇలా నితిన్ చెక్ మేట్‌లా చిక్కుకుంటాడా? చివరకు ఆట గెలుస్తాడా? అనే విషయాన్ని ఎంతో ఆసక్తిగా మలిచినట్టు కనిపిస్తోంది.

అయితే ఇందులో ప్రియా ప్రకాష్ గ్లామర్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ న్యాయవాది ముఖ్య పాత్రను పోషించినట్టుంది. మొత్తానికి ట్రైలర్‌తో భారీగా అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతోందని ఇది వరకే ప్రకటించారు. భవ్య క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కళ్యాణిమాలిక్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











