Tammudu Budget: తమ్ముడు సినిమా బడ్జెట్ అన్ని కోట్లా? హాట్ టాపిక్‌గా నితిన్ మూవీ!
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ నెక్ట్స్ తమ్ముడు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ టైటిల్ తో 1999లోనే అలరించారు. పవర్ స్టార్ కెరీయర్ లో ఆ చిత్రం ఐకానిక్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పటికీ ఆచిత్రానికి ఉన్న క్రేజే ఈవేరే. ఇక అదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ థియేటర్లలోకి వస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ అందుతున్నాయి. ఇదే సమయంలో సినిమా బడ్జెట్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
నితిన్ తమ్ముడు సినిమా వివరాలు..
తెలుగు స్టార్ నితిన్ రాబోయే చిత్రం తమ్ముడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ నిర్మిస్తుండటం విశేషం. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ మెయిన్ ఫీమెయిల్ లీడ్స్ లో నటిస్తున్నారు.సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. బీ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిశాయి. ప్రమోషన్స్ లో యూనిట్ ఫుల్ బిజీగా ఉంది.

తమ్ముడు చిత్రం బడ్జెట్ ఎన్ని కోట్లు?
ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంపై ఆసక్తికరంగా స్పందించారు. తొలుత తమ్ముడు చిత్రానికి 35 కోట్ల రూపాయల బడ్జెట్ ను అంచనా వేశామని చెప్పారు. కానీ చివరికి అది రూ.75 కోట్ల వరకు చేరుకుందని తెలిపారు. ఇక ఆ కథ అలా డిమాండ్ చేసిందని, దానికి ఆ బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందని వివరించారు. దీంతో ఈ చిత్రం బడ్జెట్ పై కొత్త చర్చ కొనసాగుతోంది.
దిల్ రాజ్ సాహసమే..
తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన తీరు ఎన్నో కష్టనష్టాలు, ఎంతో అనుభవంతో కూడినది. ఆయన ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కూడానూ. జనరేషన్ కు తగ్గట్టుగా సినిమాలు తీసే నిర్మాత, ట్రెండ్ ను ఫాలో అవ్వడమే కాదు.. తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకులకు అందించి సక్సెస్ అందుకున్న ట్రెండ్ సెట్టర్ నిర్మాత కూడానూ.
అయితే ఇప్పటికే దిల్ రాజ్ 'గేమ్ ఛేంజర్'తో ఫైనాన్షియల్ గా దెబ్బ తిని ఉన్నారని, ఇక వరుస ఫ్లాప్స్ అందుకుంటూ వస్తున్న నితిన్ పై రూ.75 కోట్లు ఎలా వెచ్చించారని చర్చ మొదలైంది. దిల్ రాజ్ ఇంత సాహసం చేశాడంటే కచ్చితంగా గొప్ప సినిమానే ఇస్తారని మరికొందరు భావిస్తున్నారు. ఇక జూలై 25న విడుదల కాబోతున్న ఈచిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











