ఆగలేకపోతున్నా.. మళ్లీ నీతో చేయాలని ఉంది.. నితిన్ కామెంట్స్
యంగ్ హీరో నితిన్, రష్మిక మందాన్న జంటగా నటిస్తోన్న చిత్రం భీష్మ. ఇప్పటికే టీజర్స్, ఫస్ట్ గ్లింప్స్, పాటలు అంటూ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది భీష్మ యూనిట్. గత కొన్నేళ్లుగా సక్సెస్ రుచి చూడని హీరో నితిన్‌కు భీష్మతో హిట్టు లభించేలానే కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వాట్టే బ్యూటీ సాంగ్ సైతం సినిమాపై హైప్‌ను పెంచేలానే ఉంది.

షూటింగ్ కంప్లీట్..
ఛలో లాంటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల చేస్తోన్న రెండో ప్రయత్నమే భీష్మ. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయిందంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు నితిన్.

గర్వంగా ఫీల్ అవుతున్నా..
భీష్మ మూవీ షూటింగ్ పూర్తైంది. ఓ వైపు సంతోషంగానే ఉన్నా మరో వైపు బాధగా ఉంది. అయినా ఇది చివరిది కాదు. మళ్లీ మనమందరం కలిసి పని చేస్తాము..ఇలాంటి హాస్య ప్రధాన చిత్రంలో నేను భాగమైనందుకు గర్వంగా ఉంది.

నీతో మళ్లీ నటించాలని ఉంది..
వెంకీ కుడుముల ఐ లవ్ యూ మ్యాన్.. నీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.. అవి చాలా చిన్నవి అవుతాయి.. భీష్మ కోసం నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. రష్మిక.. నువ్వు నా ఫేవరేట్. నీ సపోర్ట్‌కు, హార్డ్ వర్క్‌కు థ్యాంక్స్. నీతో మళ్లీ నటించాలనుంది.. ఆగలేకపోతున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు.

పెళ్లి పనుల్లో బిజీ..
ఇక నితిన్ భీష్మ మూవీ పనులు ముగిశాక తన పెళ్లి పనుల్లో బిజీ కానున్నాడని టాక్. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయని సమాచారం. నిశ్చితార్థం వేడుకలు వచ్చే నెలలో ఉంటుందని, ఏప్రిల్‌లో పెళ్లి ముహూర్తం ఉంటుందని, అయితే ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరగబోతోందని టాక్.


Click it and Unblock the Notifications











