twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకప్పటి మెగాస్టార్‌ను తలపిస్తున్న నితిన్.. నెటిజన్స్ రియాక్షన్

    |

    తెలుగు చిత్రంలో మెగాస్టార్‌ స్థానం ఎన్ని కొత్త తరాలు వచ్చిన చెరిపేయలేనిది. ఆయన మేనరిజమ్స్, స్టైల్ మరపురానివి. కొత్త కొత్త స్టైల్స్ ఎన్ని పుట్టుకొచ్చినా మెగాస్టార్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్‌లో ఉండే కిక్కేవేరు. సినిమా సినిమాకు ఆయన క్యాస్టూమ్స్ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంటాయి. అందుకే టాలీవుడ్‌లో మెగాస్టార్స్ స్టైల్ ఫాలో కావడం, సాంగ్స్ రీమేక్ చేయడం లాంటివి చేస్తుంటారు నేటితరం యంగ్ హీరోలు.

    తాజాగా నితిన్ అదే ఫాలో అయ్యాడని 'భీష్మ' పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ' నితిన్ లేటెస్ట్ మూవీ 'భీష్మ'లో సింగిల్స్ యాంతమ్ పేరుతో ఒక పాట చేశారు. తాజాగా ఆ పాట తాలూకు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నితిన్ నాలుగు రంగులు కలగలిసిన షర్ట్‌తో కనిపించాడు. అయితే అప్పట్లో ఇదే కలర్ ఫార్మాట్లో ఉన్న చొక్కాను 'విజేత' చిత్రంలో వాడారు చిరంజీవి. ఇది కనిపెట్టిన నెటిజన్లు చైరంజీవి స్టైల్‌ను నితిన్ రీక్రియేట్ చేసి ఒకప్పటి మెగాస్టార్‌ను గుర్తుచేశాడని అంటున్నారు.

     Nithiin look from Bheeshma: Same As Chiranjeevi

    సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా రూపొందింది 'భీష్మ'. 'ఛలో' సినిమాతో సక్సెస్ సాధించి మంచి గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది.

    English summary
    Young hero Nithiin new movie titled as Bheeshma which is directed by Venky Kudumula. In this movie Rashmika Mandanna act as heroine. Now from this movie Nithiin look released which is same as long back Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X