నితిన్ చాలా సాఫ్ట్.. భీష్మ నుంచి అఫీషియల్ లుక్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పై ఉన్న నితిన్.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. వాటిలో ఒకటి వెంకీ అట్లూరి, ఇంకోటి కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనుంది.
కాగా తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న భీష్మ సినిమా నుంచి నితిన్ అఫీషియల్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో నితిన్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు. నితిన్ లుక్‌ని బట్టి చూస్తే ఈ సినిమా క్లాసీగా ఫీల్ గుడ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న నితిన్- చంద్రశేఖర్ యేలేటి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకోనుందట. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి ఈ నాలుగు సినిమాలతో ఈ ఏడాది నితిన్ జోష్ మాములుగా ఉండదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











