రొమాంటిక్ మూడ్‌లో నితిన్.. రష్మిక నడుముపై మోజు పడి!
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు నితిన్. అందులో ఒకటి 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
సింగిల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. దీపావళి కానుకగా నితిన్ లోని రెండు షేడ్స్ చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్.

ఈ రెండు పోస్టర్స్‌లో ఒకటి యాక్షన్ మోడ్‌లో ఉండగా, మరొకటి రొమాంటిక్ మోడ్‌లో ఉంది. హీరోయిన్ రష్మిక మందన్న నడుము చూస్తూ.. ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అనే ఆత్రుతతో నితిన్ ఉన్నట్లుగా రొమాంటిక్ పోస్టర్ డిజైన్ చేశారు. దీంతో యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భీష్మ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా క్లాసీగా ఫీల్ గుడ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











