twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Nithiin: మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్.. ఇది శాంపిల్ మాత్రమే.. అసలైన వేట ముందుంది!

    |

    టాలీవుడ్ యువ హీరో నితిన్ మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న నితిన్ ఈసారి మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    అయితే నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టీజర్లో నితిన్ చేసిన పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

    వరుసగా అపజయాలు

    వరుసగా అపజయాలు

    యువ హీరో నితిన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్త పడుతూ ఉంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వస్తున్నా కూడా అతను వాటిని ఏమీ పట్టించుకోకుండా తన మార్కెట్ ను ఒకే తరహాలో కొనసాగిస్తూ ఉండడం కూడా విశేషం.

    నితిన్ భీష్మ సినిమా తర్వాత కొన్ని సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చెక్ రంగ్ దే సినిమాలు వరుసగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

    ఫస్ట్ ఎటాక్

    ఇక రాబోయే మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ ఎలాగైనా బాక్సాఫీసు వద్ద తన దైన శైలిలో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఎటాక్ టీజర్ ను నితిన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది. పులి వేషం తో ఉన్న వేటగాళ్లను నితిన్ వేటాడే విధానం కూడా అద్భుతంగా ఉంది. ఫైట్ సీన్స్ తోనే ప్రతిసారి ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇచ్చే నితిన్ ఈ సారి కూడా ఆ యాంగిల్ లో థ్రిల్ చేసేలా ఉన్నాడు అని చెప్పవచ్చు.

    రిలీజ్ ఎప్పుడంటే

    రిలీజ్ ఎప్పుడంటే

    మొత్తానికి ఫస్ట్ ఎటాక్ టీజర్ తో అయితే నితిన్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశాడు. జూలై 8 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా నితిన్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అలాగే గ్లామరస్ హీరోయిన్ కేథరిన్ ట్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    Recommended Video

    RRR Movie పై Alia Bhatt హర్ట్.. అలియా ని మించిన Olivia Morris క్రేజ్| Filmibeat Telugu
    శాంపిల్ మాత్రమే..

    శాంపిల్ మాత్రమే..

    ఇది శాంపిల్ మాత్రమే అంటూ అసలైన వేట జూన్ 8 నుంచి థియేటర్లో ఉంటుంది అని నితిన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాతో తప్పకుండా బాక్సాఫీస్ సక్సెస్ ను చూస్తాడు అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి అలాగే నితిన్ సోదరి గీతారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    nithiin Macherla Niyojakavargam first attack released..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X