చార్జ్ తీసుకోబోతున్న హీరో నితిన్: తొలిసారి అలా కనిపించబోతున్న యూత్ స్టార్

హిట్లు ఫ్లాపులు అనే తేడా లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతున్నాడు కాబట్టే ఈ హీరో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో 'చెక్‌', 'రంగ్ దే' మూవీలు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ, వీటికి మంచి రెస్పాన్స్ దక్కలేదు. దీంతో నితిన్‌కు నిరాశే ఎదురైంది. ఇక, వీటి తర్వాత వచ్చిన 'మాస్ట్రో' అనే సినిమా చేశాడు. ఇది మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైంది. దీనికి మాత్రం భారీ స్పందన దక్కింది.

'మాస్ట్రో' షూటింగ్ చేస్తోన్న సమయంలోనే యూత్ స్టార్ నితిన్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో ప్రముఖ ఎడిటర్ ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' అనే మూవీ ఒకటి. పూర్తి స్థాయి విభిన్నమైన కథకు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చాలా కాలంగా యూత్ స్టార్ నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఎన్నో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేశాడు. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడీ యాక్షన్, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రంలో నటిస్తున్నాడు.

'మాచర్ల నియోజకవర్గం' మూవీకి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చినా.. షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను జరుపుతున్నారు. అంతేకాదు, దీని కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నితిన్ నటిస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

Nithiins Macherla Niyojakavargam FIRST CHARGE on March 26th

నితిన్ - రాజశేఖర్ రెడ్డి కాంబోలో వస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా విభిన్నంగా చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగానే దీని నుంచి ఫస్ట్ చార్జ్ పేరిట మార్చి 26, ఉదయం 10:08 గంటలకు ఓ అప్‌డే‌ట్‌ను ఇవ్వబోతున్నట్లు యూనిట్ నేడు ప్రకటించింది. ఈ మేరకు ఓ లెటర్‌తో క్రియేట్ చేసిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక, ఇందులో నితిన్ ఎన్ సిద్దార్థ్ రెడ్డి అనే జిల్లా కలెక్టర్ పాత్రను చేస్తున్నట్లు రివీల్ చేశారు. దీంతో తొలిసారి ఈ యంగ్ హీరో ఈ తరహా రోల్‌లో కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి వైవిధ్యమైన కథతో.. కొత్త తరహా టేకింగ్‌తో రూపొందుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీలో నితిన్‌కు జోడీగా కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X