twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Macherla Niyojakavargam: పవర్‌ఫుల్ లుక్‌తో షాకిచ్చిన నితిన్.. కలెక్టర్ ఇలా ఉన్నాడేంటి!

    |

    'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను సైతం భారీగానే పెంచుకున్నాడు. అయితే, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుసగా ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడి కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పుంజుకుని బరిలో నిలిచాడు. ఇక, ఆ మధ్య వరుసగా హిట్లను ఖాతాలో వేసుకున్న నితిన్ 'భీష్మ'తో భారీ సక్సెస్‌ను కూడా అందుకుని సత్తా చాటాడు.

    బ్రాతో రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ: ఈ ఫొటో షేర్ చేయకూడదు కానీ అంటూ షాకింగ్ పోస్ట్బ్రాతో రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ: ఈ ఫొటో షేర్ చేయకూడదు కానీ అంటూ షాకింగ్ పోస్ట్

    గత ఏడాది మాత్రం యూత్ స్టార్ నితిన్ మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో 'చెక్‌', 'రంగ్ దే' మూవీలు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ, వీటికి మంచి రెస్పాన్స్ దక్కలేదు. దీంతో నితిన్‌కు నిరాశే ఎదురైంది. ఇక, వీటి తర్వాత వచ్చిన 'మాస్ట్రో' అనే సినిమా చేశాడు. ఇది మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైంది. దీనికి మాత్రం భారీ స్పందన దక్కింది. కానీ, థియేటర్ సక్సెస్ కాకపోవడంతో అతడి అభిమానులు నిరాశగానే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

    ఇందులో భాగంగానే నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే మూవీ చేస్తున్నాడు. పూర్తి స్థాయి విభిన్నమైన కథకు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చాలా కాలంగా యూత్ స్టార్ నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఎన్నో విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేశాడు. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడీ యాక్షన్, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రంలో నటిస్తున్నాడు. ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చినా.. షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను జరుపుతున్నారు.

    బెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మబెడ్‌పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ

    Nithiins Macherla Niyojakavargam FIRST Look Released

    నితిన్ హీరోగా నటిస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా విభిన్నంగా చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగానే దీని నుంచి ఫస్ట్ చార్జ్ పేరిట మార్చి 26, ఉదయం 10:08 గంటలకు ఓ అప్‌డే‌ట్‌ను ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అందుకు అనుగుణంగానే తాజాగా దీని నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నితిన్ ఊరమాస్ గెటప్‌తో కనిపించి షాకిచ్చాడు. అంతేకాదు, పవర్‌ఫుల్ జిల్లా కలెక్టర్‌గా చార్జ్ తీసుకున్నట్లు చూపించారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా ఉంటాడా అని అందరూ ఆశ్చర్యపడేలా అతడి గెటప్‌ను డిజైన్ చేశారు.

    విభిన్నమైన మాస్ కథతో రాబోతున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీలో నితిన్‌కు జోడీగా కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.

    English summary
    Nithiin now Doing Macherla Niyojakavargam Under M.S. Rajashekhar Reddy Direction. Now This Movie FIRST Look Was Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X