twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Macherla Niyojakavargam సెన్సార్ రిపోర్ట్.. మాచర్ల మాస్ జాతరను సిద్ధం చేసిన నితిన్

    |

    టాలెంటెడ్ మాస్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఓవర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇదివరకే సినిమాకు సంబంధించిన పాటలు టీజర్స్ అలాగే ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తప్పకుండా సినిమా మాస్ ఆడియన్స్ ను అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెన్స్ తో సినిమాను విడుదల చేస్తోంది.

    అయితే సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల ముగిశాయి. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా విడుదల చేసింది. మాచర్ల మాస్ జాతరకు అంతా సిద్ధమంటూ ఈ సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించినట్లుగా చిత్ర యూనిట్ తెలియజేసింది. సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపిస్తూనే మరొకవైపు మాస్ హీరోగా కూడా విలన్స్ ను ఊచకోత కోస్తాడు అని తెలుస్తోంది.

    Nithiin Macherla Niyojakavargam movie censor report positive response

    ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నాయట. యాక్షన్ ప్రియులకు ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుంది అని కూడా తెలుస్తోంది. సెన్సార్ యూనిట్ నుంచి అయితే చిత్ర యూనిట్ కి మంచి ప్రశంసలు అందాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మరొక టాలీవుడ్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    రారా రెడ్డి అనే పాటలో నితిన్ మాస్ స్టెప్పులు అంజలి గ్లామర్ దానికి తోడు ట్యూన్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక సినిమాలో కూడా ఆ పాట మరింత విజిల్స్ వేయిస్తుంది అని అర్థమవుతుంది. మరి మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి. శ్రేష్ఠ మూవీస్ లో నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించగా మేయిన్ హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.

    English summary
    Nithiin Macherla Niyojakavargam movie censor report positive response
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X