Nithiin Maestro First Glimpse: బర్త్ డే రోజు థ్రిల్ చేసిన నితిన్.. ఫస్ట్ లుక్ అదిరింది
టాలీవుడ్ యువ హీరో నితిన్ స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాతో ఆడియెన్స్ కు సరికొత్త కిక్కిస్తున్నాడు. ఈ రెండు నెలల్లోనే మూడు సినిమాలకు సంబంధించిన న్యూస్ లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త సినిమా గ్లింప్స్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

స్పీడ్ పెంచిన నితిన్
నితిన కెరీర్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొనసాగుతోంది. గత ఏడాది భీష్మ సినిమాతో కమర్షియల్ గా బాక్సాఫీస్ హిట్ కొట్టిన ఈ యువ హీరో వెంటనే మరో సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది మాత్రం నితిన్ ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు.

మరో హిట్టు సినిమా
ఫిబ్రవరిలో చెక్ సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక మొన్న విడుదలైన రంగ్ దే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు.

మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా 30వ సినిమా మాస్ట్రోకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కళ్ళు కనిపించవు అని అబద్ధం చెప్పుకుంటూ మోసపూరిత వ్యక్తిగా నితిన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్ లో నితిన్ సరికొత్త థ్రిల్ ని కలిగించాడు. ఐస్ బౌల్ లో నితిన్ మొహం పెట్టిన గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.

బాలీవుడ్ రీమేక్ గా..
ఫస్ట్ గ్లింప్స్‌కు స్వర సాగర్ మహాతి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఈ మూవీ బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి కమర్షియల్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మెర్లపాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలో తమన్నా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుండగా నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











