Maestro మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: నితిన్ సినిమా ఎందులో రాబోతుందంటే!
గత ఏడాది 'భీష్మ'తో కెరీర్‌లోనే భారీ హిట్‌ను అందుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం అతడికి అంతగా కలిసి రాలేదు. ఇప్పటికే ఈ యంగ్ హీరో నటించిన రెండు సినిమాలు (చెక్, రంగ్ దే) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయ్యాడు. అదే.. బాలీవుడ్ హిట్ మూవీ 'అంధాధున్'కు రీమేక్‌గా వచ్చిన 'మాస్ట్రో'. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
కరోనా రెండో దశ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలోనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో' కూడా ఓటీటీ డీల్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇందులో భాగంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులను ఏకంగా రూ. 32 కోట్లకు కొనగోలు చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'మాస్ట్రో'లో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











