షాకింగ్: నితిన్ పెళ్లి వాయిదా!.. డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్‌కు కారణమదేనట..
టాలీవుడ్ యువ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ సినిమా ఘనం విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. అంతేకాకుండా తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా సంతోషం ఉన్నారు. అయితే ఈ సంతోషానికి బ్రేకుల పడే అవకాశం కనిపిస్తున్నది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందంటే..

నిశ్చితార్థం, భీష్మ విజయంతో
నితిన్, షాలిని నిశ్చితార్థం ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కేవలం ప్రైవేట్ కార్యక్రమంగానే జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత రిలీజైన భీష్మ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ ఉత్సాహం రెండితలైంది.

దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్
నిశ్చితార్థం తర్వాత నితిన్, షాలిని పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ దుబాయ్‌లో జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అందుకు తగినట్టుగా ఏప్రిల్ 15వ తేది ముహుర్తంగా నిర్ణయించారు. ఈ వేడుక కోసం దుబాయ్‌లోని వెర్సేస్ పలాజో లగ్జరీ హోటల్‌ను వేదికగా మార్చారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఈ పెళ్లికి కరోనా వైరస్ బ్రేక్ వేసినట్టు సమాచారం.

ఏప్రిల్ 15న పెళ్లి, 16న రిసెప్షన్
వాస్తవానికి ముందుగా షెడ్యూల్ చేసుకొన్న ప్లాన్ ప్రకారం దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అందుకు దాదాపు 60 మంది గెస్టులను ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్ దెబ్బకు ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి.

కరోనాతో ప్లాన్ బీ..
అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ప్లాన్ బీని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తున్నది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్‌లో ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే అనుకొన్న తేదీనే పెళ్లిని జరిపిస్తే బాగుండని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇరు కుటుంబాల నుంచి గానీ, నితిన్ నుంచి గానీ పెళ్లి వాయిదా పడినట్టు అధికారికంగా వార్తలు వెలువడకపోవడం గమనార్హం.
Recommended Video

2012 నుంచి డేటింగ్
నితిన్, షాలిని రిలేషన్ 2012 నుంచి కొనసాగుతున్నది. కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే తమ రిలేషన్‌ను బయటపడకుండా ప్రైవేట్‌గా ఉంచడంలో నితిన్ జాగ్రత్త పడ్డారు. ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దాంతో ఏప్రిల్ 15న పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











