బన్నీకి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కు నితిన్ ఛాన్స్.. తొలిసారి అలాంటి కథతో యూత్ స్టార్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న యంగ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. 'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. మధ్యలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న తరుణంలో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం నితిన్ 'భీష్మ' అనే భారీ హిట్‌ను సొంతం చేసుకుని సత్తా చాటాడు.
'భీష్మ' విజయం ఇచ్చిన ఉత్సాహంతో హీరో నితిన్ రెట్టించిన జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే గత ఏడాది ఏకంగా 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో మొదటి రెండు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ, అక్కడ ఈ చిత్రానికి రెస్పాన్స్ అంతగా దక్కలేదు. ఫలితంగా ఈ రెండు మూవీలు పరాజయం పాలయ్యాయి. ఇక, 'మాస్ట్రో' మాత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. దీనికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ మూవీ మాత్రమే సక్సెస్ అయింది.

ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమా చేస్తున్నాడు. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఇదిలా ఉండగానే... హీరో నితిన్.. ప్రముఖ రచయిత కమ్ దర్శకుడు వక్కంతం వంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'నా పేరు సూర్య' వంటి ఫ్లాప్‌తో డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆయన చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
వక్కంతం వంశీ దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ చేయబోయే సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ, హీరోయిన్ తదితర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో నితిన్ పోషించే పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో నితిన్ యంగ్ పొలిటీషియన్‌గా నటిస్తున్నాడట. గతంలో యాక్షన్ సినిమాల్లో నటించినా.. అతడు ఈ తరహా పాత్రను మాత్రం పోషించలేదు. అందుకే ఇందులో అదిరిపోయే రోల్‌ను క్రియేట్ చేశాడట వక్కంతం వంశీ. ఇక, కథ కూడా ఎమోషనల్‌గా సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు.
యువత రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పులు చేయొచ్చు అనే నేపథ్యంలో వక్కంతం వంశీ ఈ సినిమాను రూపొందించబోతున్నాడని తెలుస్తోంది. 'మాచర్ల నియోజకవర్గం' మూవీ విడుదల కాకముందే దీన్ని పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నారట. అంతేకాదు, ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేలా షెడ్యూళ్లను జరపాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ను కూడా నిర్మిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











