రంగ్ దే సెన్సార్ రిపోర్ట్.. మరోసారి నవ్వడానికి రెడీగా ఉండండి!
యంగ్ హీరో నితిన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కాస్త విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న నితిన్ ఇటీవల చెక్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో పక్కా ఎంటర్టైన్మెంట్ కథతో రెడీ అయ్యాడు.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన మూడవ సినిమా రంగ్ దే. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమాను ఈ నెల 26న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. సినిమా చూసిన వాళ్ళు ఇప్పటికే పాజిటివ్ గా స్పందించారు. సినిమా రొమాంటిక్ గానే కాకుండా ఫుల్ కామెడీతో ఉంటుందని అంటున్నారు. నితిన్ కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించగా నరేష్, రోహిణి, అభినవ్, సుహాస్, వెన్నెల కిశోర్ వంటి తలంటెడ్ నటీనటులు నటించారు.


Click it and Unblock the Notifications











