మగాడివిరా బుజ్జి.. నితిన్ ‘రంగ్ దే’ ట్రైలర్ వైరల్
నితిన్ కీర్తి సురేష్‌లు జంటగా నటించిన రంగ్ దే మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలన్నీ కూడా రెట్టింపు అయ్యాయి. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో అర్జున్ అను అంటూ కీర్తి సురేష్ నితిన్ ఎందుకు పగ తీర్చుకునేందుకు ప్రయత్నించారో సినిమా ట్రైలర్ చూశాక అర్థమై ఉంటుంది. ఆ మధ్య కీర్తి సురేష్ నిద్ర పోతోన్న వీడియోను షేర్ చేసిన నితిన్.. తాజాగా ఓ పంచ్ ఇచ్చింది కీర్తి సురేష్.
అలా ఈ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలాంటి పాత్రలను పోషిస్తున్నారని చెప్పకనే చెప్పేశారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లోనూ అదే స్పష్టమైంది. కీర్తి సురేష్, నితిన్ మధ్య కావాల్సినంత రొమాన్స్‌ను పెట్టారు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా ప్రతీ ఒక్కటి రంగ్ దే సినిమాలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గెలవడానికి కాదు కలవడానికి గొడవలు చెయ్.. నువ్ మగడావిరా బుజ్జి అంటూ ఇలా కొన్ని డైలాగ్‌లు బాగానే ఆకట్టుకుంటున్నాయి. సితారా ఎంటర్టైన్మైంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ మూవీని వెంకీ అట్లూరి తీర్చిదిద్దినట్టు ట్రైలర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ బాగా వైరల్ అవుతుండటంతో సినిమాపై బజ్ బాగానే ఏర్పడేలా ఉంది.


Click it and Unblock the Notifications











