త్రివిక్రమ్ గారు.. ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసిన నితిన్.. వైరల్ వీడియో
Recommended Video
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ తెగ బాధపడుతున్నాడు. అ.. ఆ అంటూ తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ దృశ్యం కనిపించింది. పైగా దీన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు హీరో నితిన్. ఇంతకీ ఏం జరిగింది? నితిన్ అంతలా ఎందుకు బాధ పడుతున్నాడు? వివరాల్లోకి పోతే..

వరుస సినిమాలకు కమిట్.. నితిన్ స్పీడ్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు నితిన్. ఇందులో ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అదే సెట్.. సేమ్ లొకేషన్.. నితిన్ ఏడుపు
వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నితిన్ గత సినిమా 'అ.. ఆ' షూట్ చేసిన లొకేషన్ లోనే జరుగుతోందట. సేమ్ అదే ఇల్లు.. అదే లొకేషన్.. ఇక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇదే హీరో నితిన్ ఏడుపుకు కారణమైంది.

ఆ ఇంట్లో మెట్ల దగ్గర కూర్చొని..
భీష్మ షూటింగ్ జరుగుతున్న ఆ ఇంట్లో మెటల్ దగ్గర కూర్చొని అ.. ఆ జర్నీని నెమరు వేసుకుంటూ తలచుకొని ఏడ్చేశాడు నితిన్. పైగా ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ''అ.. ఆ అదో అద్భుతమైన జర్నీ. అదే లొకేషన్ లో షూట్ చేస్తుండటంతో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఐ మిస్ యూ త్రివిక్రమ్ గారు'' అని పేర్కొన్నాడు.
నితిన్- త్రివిక్రమ్ కాంబోలో సూపర్ డూపర్ హిట్.. అ ఆ
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ సన్నిహితుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో నితిన్ జోడీగా సమంత నటించింది. గత మూడేళ్ళ క్రిందటవచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి నితిన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

భీష్మ మూవీ
ఇక నితిన్ తాజా సినిమా భీష్మ విషయానికొస్తే.. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











