షూటింగ్ మొదలెట్టిన రంగ్ దే టీం.. పుల్ జోష్‌లో నితిన్
టాలీవుడ్ మొత్తం సందడిగా మారిపోయింది. షూటింగ్‌లతో మళ్లీ కళకళాడుతోంది. చిన్న, మీడియం చిత్రాలన్నీ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. వారం రెండు వారాలే షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. అందుకే లవ్ స్టోరీ, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలు ముందుగా షూటింగ్ మొదలెట్టాయి. పూర్తి చేసుకున్నాయి కూడా. ఈ క్రమంలో నితిన్ కూడా రంగంలోకి దిగాడు.
ఈ మద్యే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడైన నితిన్.. లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో గడిపాడు. నితిన్ పెళ్లి వేడుకలు టాలీవుడ్ ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. పరిమిత సంఖ్యలోనే బంధువులను పిలిచారు. ఓ ఇంటి వాడైన నితిన్.. ప్రస్తుతం మళ్లీ తన రొటీన్ లైఫ్‌లోకి రాబోతోన్నాడు. లైట్స్, కెమెరా, యాక్షన్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అసలే భీష్మ ఇచ్చిన విజయంతో మంచి ఫాంలో ఉన్నాడు నితిన్.

అదే ఊపులో రంగ్ దే చిత్రాన్ని పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ఈ మేరకు షూటింగ్ సెట్‌లో దిగిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ నిబందనలు పాటిస్తూనే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యూనిట్ పేర్కొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఏ రేంజ్‌లో వర్కౌట్ అయిందో అందరికీ తెలిసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











