నితిన్ 'అంధాదున్' రీమేక్ స్టార్ట్.. రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచంటే..
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది వరుస సినిమాలతో కనువిందు చేయబోతున్నాడు. ఇప్పటికే భీష్మ సినిమాతో 2020 సంవత్సరానికి శుభారంభం చేసిన నితిన్.. ఇటీవలే బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా మూవీ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ రోజే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు.
ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు నేటివిటీకి తగినట్టు అంధాదున్ మూవీ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి స్పందించిన నితిన్.. ఈ రీమేక్‌లో నటించడానికి కొంచెం భయంగా ఉందని అన్నాడు. అంధాదున్లో హీరోగా నటించిన ఆయుష్మాన్‌కు జాతీయ అవార్డు వచ్చింది. అదే తనకు భయం కలిగిస్తోందని నితిన్ చెప్పాడు.

ఇకపోతే నితిన్ లేటెస్ట్ మూవీ 'భీష్మ' సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్- రష్మిక మందన్న జోడీ బాగా ఆకట్టుకుంది. సంగీతం, పాటలు, కామెడీ అన్నీ కలిసిరావడంతో బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది భీష్మ మూవీ. మరోవైపు తన పెళ్లి పనులను కూడా వేగవంతం చేశాడు నితిన్. ఇదంతా చూస్తుంటే ఈ ఏడాదంతా నితిన్ నిత్యం వార్తల్లోనే నిలుస్తాడని స్పష్టంగా తెలుస్తోంది కదూ!.


Click it and Unblock the Notifications











