twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీష్మ ఫస్ట్ టాక్: పెళ్లికి ముందు నితిన్ ఖాతాలో.. ఆడియన్స్ ఏమంటున్నారంటే..

    |

    యంగ్ హీరో నితిన్ తాజా సినిమా 'భీష్మ'. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 21) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చిత్రంలో నితిన్ జోడీగా రష్మిక మందన్న నటించింది. ప్రమోషన్స్ ద్వారా సినిమాకు భారీ హైప్ చేకూరడంతో ఓ రేంజ్ అంచనాల నడుమ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమంటున్నారో చూద్దామా..

    కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్..

    కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్..

    భీష్మ సినిమాపై ఆడియన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. చిత్రానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కామెడీతో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు జనం. ఎక్కువమంది జనం సినిమా చాలా బాగుందనే అంటున్నారు. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ నడిపించారని టాక్ వస్తోంది.

    నితిన్‌ రోల్.. ఫస్టాఫ్ అంతా అదే..

    నితిన్‌ రోల్.. ఫస్టాఫ్ అంతా అదే..

    భీష్మ సినిమాలో నితిన్ రోల్ ఆకట్టుకుందని అంటున్నారు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు మేజర్ అసెట్ అని చెబుతున్నారు. నితిన్ క్యారెక్టరైజేషన్ సూపర్ అని, నితిన్‌కు పర్ఫెక్ట్ రోల్ ఇచ్చారని, ఆ రోల్‌లో ఆయన అభినయం బాగుందనేది జనం మాట.

    సెకండాఫ్‌.. అలా కవర్ చేస్తూ

    సెకండాఫ్‌.. అలా కవర్ చేస్తూ

    సింగిల్స్ సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగుందని, యూత్ ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని టాక్. ఇకపోతే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్‌లో కొంచె ల్యాగ్ ఉన్నప్పటికీ దాన్నికూడా కామెడీ సన్నివేశాలతో కవర్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లారని అంటున్నారు. మొత్తంగా అయితే మంచి ఎంటర్‌టైన్మెంట్‌ పంచిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

    వెన్నెల కిషోర్, రఘుబాబు సీన్స్.. అబ్బో!

    వెన్నెల కిషోర్, రఘుబాబు సీన్స్.. అబ్బో!

    హీరోయిన్ రష్మిక మందన్న తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని, గ్లామర్ తో వెండితెరకు అందం తీసుకొచ్చిందని అంటున్నారు ఆడియన్స్. అలాగే వెన్నెల కిషోర్, రఘుబాబు కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయని టాక్ వినిపిస్తోంది.

    Recommended Video

    Brahmaji Teasing Anchor Suma At Bheeshma Pre Release Event | Filmibeat Telugu
    నితిన్ కెరీర్‌లో భీష్మ..

    నితిన్ కెరీర్‌లో భీష్మ..

    మొత్తానికి భీష్మ మూవీ నితిన్ కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఈ టాక్‌ని బట్టి తెలుస్తోంది. ఇక ఈ మూవీపై క్రిటిక్స్ ఎలా స్పందిస్తారు? మార్నింగ్ షో తర్వాత ఎలాంటి మౌత్ టాక్ వస్తుంది? ఇవన్నీ తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే మరి!.

    English summary
    Young hero Nithiin new movie Bheeshma which is directed by Venky Kudumula. This movie released today and getting possitive talk from audians. We are reporting some of audians responce on Bheeshma movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X