రష్మికకు వరుస ఆఫర్లు... నితిన్‌తో 'భీష్మ' మూవీ మొదలైంది
నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త మూవీ ప్రారంభం అయింది. 'భీష్మ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 'జెర్సీ' చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవం బుధవారం ఉదయం 10 : 19 గంటలకు సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో మూవీ విడుదల అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసినట్లు నిర్మాత తెలిపారు.

స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
ఈ చిత్రంలో నితిన్, రష్మిక మండన, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ : మహతి స్వర సాగర్, డి .ఓ .పి : సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట రత్నం(వెంకట్ ), సమర్పణ : పి.డి .వి. ప్రసాద్, ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.


Click it and Unblock the Notifications











