భీష్మ సింగిల్స్ యాంథమ్: హగ్గింగ్ కోసం నితిన్ వెయిటింగ్.. సూపర్ ట్యూన్స్
నితిన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. 'ఛలో' సినిమాతో సక్సెస్ సాధించి మంచి గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

నేడు (ఫిబ్రవరి 14) వేలంటైన్స్ డే సందర్భంగా భీష్మ నుంచి సింగిల్స్ యాంథమ్ అనే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ప్లస్ అయింది. శ్రీమణి అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నితిన్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. హగ్గింగ్ కోసం వెయిటింగులే అంటూ నితిన్ పడుతున్న పాట్లు యువతను ఆకట్టుకుంటున్నాయి.
ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న భీష్మ సినిమాకు సంబంధించి ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి. చిత్రంలో వెన్నెల కిశోర్- నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న నితిన్ - రష్మిక జోడీ కట్టడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











