చంద్రశేఖర్ యేలేటి ఎందరో డైరెక్టర్లకు ఇన్స్‌పిరేషన్.. మిర్చి సంపత్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ నిర్మాతగా నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 26 తేదీన రిలీజ్‌కు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకొంటున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేడుకకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. దర్శకులు గోపిచంద్ మలినేని, వెంకీ కుడుముల ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆలరించాయి.
ఈ వేడుకలో నటుడు 'మిర్చి' సంపత్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్లు, అసిసెంట్ డైరెక్టర్లతో పనిచేశాను. చంద్రశేఖర్ యేలేటి గురించి చాలా మంది వద్ద విన్నాను. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది మీకు తెలియకపోవచ్చు. మీరు ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు మీరు ఇన్స్‌పిరేషన్. చెక్ విషయానికి వస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నితిన్‌కు భీష్మ కంటే పెద్ద సక్సెస్ లభిస్తుంది. భవ్య క్రియేషన్స్ నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటింది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ చాలా సింపుల్‌గా ఉంటారు. లౌక్యం కంటే పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











