Macherla Niyojakavargam త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్.. బోయపాటి యాక్షన్ అంటూ నితిన్ మాస్ ఎలిమెంట్స్‌తో!
శ్రీశ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ట్రైల్ ఆవిష్కరణ గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు కృతిశెట్టి, క్యాథరీన్ త్రెసా, జానీ మాస్టర్, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డిగా నితిన్
మాచర్ల నియోజకవర్గం చిత్రంలో సిద్దార్థ్ రెడ్డిగా నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్లు నిర్వహించడమే అతడి ధ్యేయం. అతడి లక్ష్యానికి రాజప్ప (సముద్రఖని) అడ్డుపడటం సవాల్‌గా నిలుస్తుంది. అయితే రాజప్ప ఫ్యాక్షన్‌ను ఎలా నిలువరించారనేది ట్రైలర్‌లో చూపించిన అంశాలు స్పష్టం చేశాయి.

పవర్ ఫుల్ డైలాగ్స్..యాక్షన్ సీన్లతో
మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలాగే పుష్కలంగా కమర్షియల్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కనిపించాయి. నీవేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరిగా పంచు డైలాగ్స్, నీవేమో బోయపాటి శ్రీనులా యాక్షన్, ఇప్పుడు నేనేమీ చేయాలి. రాజమౌళి సినిమాలో హీరోగా ఎలివేషన్ ఇవ్వాలా అంటూ మంచి ఫైట్ సీక్వెన్స్‌తో ట్రైలర్‌లో నితిన్ హడావిడి చేశాడు. పులి, జింకా అంటే బోనులో వేసి తొక్కిస్తా. ఎఫ్ఐఆర్ నమోదు చేయి.. నా ఆర్డర్.. రాజప్పైనా, బొంగప్పైనా ఇదే పనిష్‌మెంట్. సివిల్ సర్వెంట్ అంటే.. సాఫ్ట్‌గా డీల్ చేస్తారు. కానీ నాలో ఇన్‌బిల్ట్ కమర్షియల్. డైరెక్ట్ ఎటాక్ అంటూ నితిన్ పవర్‌ఫుల్ యాక్షన్‌తో కనిపించాడు.

గుంటూరులో అనిల్ రావిపూడి స్పీచ్
మాచర్ల నియోజకవర్గం ఆడియో లాంచ్ ఆవిష్కరణ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ వేడుకలో నితిన్, అనిల్ రావిపూడి, క్యాథరిన్ త్రెసా, కృతిశెట్టితో జానీ మాస్టర్ స్టెప్పులేసి హంగామా చేశాడు. ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది.మాచర్ల నియోజకవర్గంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నేను వైజాగ్‌లో బాలకృష్ణ 108 స్క్రిప్టు వర్క్ చేసుకొంటూ కూర్చున్నా. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రమ్మని అడిగారు. ఎక్కడ అంటే గుంటూరు మనకు టచ్ ఉంది. 8 ఏళ్లు ఇక్కడే చదివాను. మీ మాదిరిగానే ఇక్కడ సినిమాలు చూశాను అని అనిల్ రావిపూడి తెలిపారు.

బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు అంటూ
గుంటూరులో బ్లాక్‌బస్టర్ సినిమాలు చూశాను. ఇక్కడ ఒక్కో హీరోకు ఒక థియేటర్ ఉంటుంది. బాలయ్య బాబుకు కృష్ణ మహల్, చిరంజీవికి కృష్ణా పిక్చర్ ప్యాలెస్, పవర్ స్టార్‌కు లిబర్టీ, మహేష్ బాబుకు నాజ్ ఇలా ఒక్కో హీరోకు థియేటర్ ఉంటాయి. అలాగే దేశ ముదురు సినిమాలో గుంటూరు ఏక్ షెహర్ ఉంది. ఇదర్ మారేతో.. ఉదర్ ఆతా అని మీ సౌండ్‌ను బట్టి పూరీ రాశారు. ట్రైలర్ మాస్‌గా ఉంది. నితిన్ హై ఓల్టేజ్‌తో కనిపించారు అని అనిల్ రావిపూడి అన్నారు.

సినిమా హిట్‌కు ముందు గుంటూరుకు
నితిన్ మాట్లాడుతూ.. సై హిట్ తర్వాత నేను ఫస్ట్ గుంటూరుకు వచ్చాను. ఆ తర్వాత అఆ సినిమా హిట్ తర్వాత వచ్చాను. ఈ సినిమా హిట్ కంటే ముందే వచ్చాను. ఈ ఫంక్షన్ కోసం వచ్చిన అనిల్ రావిపూడి థ్యాంక్స్. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే విధంగా కోరియోగ్రఫి చేసిన జానీ మాస్టర్ థ్యాంక్స్. ఆగస్టు 12 తేదీన థియేటర్లలో డైరెక్ట్‌గా యాక్షన్ అని నితిన్ అన్నారు


Click it and Unblock the Notifications











