ఇస్మార్ట్ బ్యూటీతో నితిన్ బైక్ రైడ్: ఒక్క దానితోనే ఆసక్తిని పెంచేస్తోన్న మాస్ట్రో
గత ఏడాది ప్రారంభంలోనే 'భీష్మ' అనే సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు యూత్ స్టార్ నితిన్. ఈ సినిమా ఫలితం ఇచ్చిన జోష్‌లో వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఆరంభంలో చంద్రశేఖర్ ఏలేటీ రూపొందించిన 'చెక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందు ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీని తర్వాత వెంకీ అట్లూరి తీసిన 'రంగ్ దే' సినిమా విడుదలైంది. ఇది కూడా నితిన్‌కు నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ అతడు మరో మూవీతో వస్తున్నాడు.
యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ స్కూటీ డ్రైవింగ్ చేస్తుండగా.. నితిన్ ఆమె వెనుక కూర్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు సైతం మంచి స్పందన వస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాస్ట్రో' మూవీలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇందులో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. 2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో


Click it and Unblock the Notifications











