twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుడ్ న్యూస్ చెప్పిన ‘మాస్ట్రో’ యూనిట్: పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు

    |

    టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దీంతో దీన్ని జూన్ 11న విడుదల చేస్తామని కూడా అప్పుడు ప్రకటించారు. అయితే, కరోనా రెండో దశ కారణంగా అది సాధ్య పడలేదు. ఇప్పుడు కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఈ మధ్యనే చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ యూనిట్ నితిన్ ఫ్యాన్స్‌కు తాజాగా ఓ గుడ్ న్యూస్‌ను చెప్పింది.

    కొంత భాగం షూటింగ్ మిగిలి ఉన్న సమయంలోనే 'మాస్ట్రో' చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇక, ఇటీవలే మొదలైన షెడ్యూల్‌లో హీరో నితిన్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే, తమన్నా భాటితో నితిన్ సీన్స్‌ను కూడా షూట్ చేశారు. వీటితో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను సైతం తెరకెక్కించారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం యూనిట్ సోషల్ మీడియాతో విడుదల చేసింది. దీనిపై నితిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

     Nithiins Maestro Movie Shooting Completed

    షూటింగ్ మొత్తం పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట 'మాస్ట్రో' యూనిట్. వీటిని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి సినిమాను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. దీన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.

    English summary
    Tollywood Youth Star Nithiin Now Doing Maestro Movie Under Merlapaka Gandhi Direction. Now This Movie Shooting was Completed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X