వారం రోజుల ముందే ఆగిపోయిన నితిన్ సినిమా: అదే జరిగితే ప్లాన్ వర్కౌట్ అయ్యేదే
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను కొనసాగిస్తోన్న అతడు.. కొన్ని ఫ్లాపులు వచ్చినా.. మధ్యలో భారీ హిట్లను కూడా అందుకుంటున్నాడు. ఇలా కెరీర్‌ను హిట్లు ఫ్లాపుల మేళవింపుతో సాగిస్తున్నాడు. ఇక, ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ పరాజయాలను చవి చూసిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. అదే ప్రయోగాత్మక చిత్రం మాస్ట్రో. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
పూలతో అందాలను దాచేస్తున్న జక్వాలిన్ ఫెర్నాండెజ్
యూత్ స్టార్ నితిన్ - టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'మాస్ట్రో'. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'అంధాధున్'కు ఈ చిత్రం రీమేక్‌గా వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. సింగిల్ షెడ్యూల్‌లోనే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేశారు. మరో వారం రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైంది. దీంతో ఈ సినిమా చిత్రీకరణను నిలిపి వేసిందట యూనిట్. కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాతనే దీన్ని పున: ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాస్ట్రో' మూవీలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇందులో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అలాగే, అత్యంత ముఖ్యమైన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించనుంది. నితిన్ సొంత బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











