నితిన్ బర్త్ డే సర్‌ప్రైజ్: 'రంగ్ దే' మోషన్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ బర్త్ డే సర్‌ప్రైజ్ ఒకరోజు ముందుగానే రివీల్ చేశారు 'రంగ్ దే' మేకర్స్. రేపు అనగా (మార్చి 30) నితిన్ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ రోజే 'రంగ్ దే' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల క్యారెక్టర్ల పేర్లు అను, అర్జున్ అని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు.
హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ వెంకీ అట్లూరి కాంబోలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'రంగ్ దే' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. 'గివ్ మీ సమ్ లవ్' అనేది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ నితిన్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించగా తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ నూతనోత్సాహం నింపింది.

నితిన్ కెరీర్ లో 29వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతోందని, ఈ ఏడాది వేసవిలో 'రంగ్ దే' మూవీని ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు జరుగుతున్నట్లుగా టాక్.


Click it and Unblock the Notifications











