రంగంలోకి నితిన్ 'రంగ్ దే' టీమ్.. హంగామా షురూ అసలు విషయం!
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది బాగానే హంగామా చేయబోతున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదంతా నిత్యం నితిన్ వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటు పెళ్లితో పాటు అటు వరుస సినిమాలను లైన్‌లో పెట్టి వేగం పెంచేశాడు హీరో నితిన్.
ఈ నేపథ్యంలోనే హోలీ పండగను పురస్కరించుకొని ఆయన లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు నితిన్. సెట్స్‌పై 'రంగ్ దే' సినిమా యూనిట్‌తో దిగిన పిక్ షేర్ చేస్తూ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు మార్చి ఎండింగ్ నుంచి 'రంగ్ దే' హంగామా స్టార్ట్ కానుందని, అప్పటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తామని ప్రకటించాడు.

హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ వెంకీ అట్లూరి కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'రంగ్ దే' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. 'గివ్ మీ సమ్ లవ్' అనేది ఉపశీర్షిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.


Click it and Unblock the Notifications











