భీష్మ సక్సెస్ మీట్.. నాగశౌర్యపై నితిన్ సెటైర్.. ఒక్కసారిగా అందరూ షాక్

హీరో నితిన్ చాలా కాలం తరువాత భారీ హిట్ కొట్టాడు. అఆ సినిమా అనంతరం ఒక్క సక్సెస్ లేని నితిన్.. కొత్తగా ప్రయత్నిస్తూ వస్తూనే ఉన్నాడు. లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలు బోల్తా కొట్టాడు. అయితే ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తనకు కలిసొచ్చిన కమర్షియల్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. అదే 'భీష్మ'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను నేడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నితిన్ చేసిన ఓ కామెంట్ హీరో నాగశౌర్యకు పంచ్ వేసినట్టుగా ఉంది. అసలు నితిన్ ఏమన్నాడు? ఏం జరిగిందన్నది ఓసారి చూద్దాం.

Recommended Video

Nithiin Satirical Comments On Naga Shaurya
భీష్మ సక్సెస్ మీట్..

భీష్మ సక్సెస్ మీట్..

భీష్మ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లడంతో చిత్రబృందమంతా కలిసి సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో నితిన్ ఓ పంచ్ వేశాడు. అదెంటన్నది ఓ సారి చూద్దాం.

అప్పుడే సక్సెస్ మొదలైంది..

అప్పుడే సక్సెస్ మొదలైంది..

వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్ తెలిపాడు. చిత్రానికి పని చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. చినబాబు, నిర్మాత నాగవంశీ ఈ కథను ఎప్పుడు ఓకే చేశారో అప్పుడే సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు.

అప్పటికే రష్మిక స్టార్ హీరోయిన్..

అప్పటికే రష్మిక స్టార్ హీరోయిన్..

ఈ కథను ఒప్పుకున్నందుక నితిన్, రష్మికలకు థ్యాంక్స్. ఈ కథను వినిపించడానికి వెళ్లినప్పుడు రష్మిక అప్పటికే స్టార్ హీరోయిన్ అయిందని, అయినా సరే నా కథ విని ఒప్పుకుందని చెప్పుకొచ్చాడు. ఆమె ఎంత బాగా నటిస్తుందో.. స్నేహానికి కూడా అంతే విలువ ఇస్తుందని తెలిపాడు.

ఈ కథ నీదేనా..?

ఈ కథ నీదేనా..?

దిల్ సినిమా చూసినప్పటి నుంచి.. ఆయనకు ఫ్యాన్ అయ్యాయని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నానని, తాను సినిమాల్లోకి వచ్చాక ఒక్క కమర్షియల్ చిత్రం చేయాలని అనుకున్నా.. ఒక ఫ్యాన్ ఎలా చూపిస్తాడో అలా చూపించానని అది అందరికీ నచ్చిందని తెలిపాడు. ఇలా వెంకీ కుడుముల మాట్లాడుతూ ఉండగా నితిన్ మధ్యలో కలగజేసుకుని.. ఈ కథ నీదేనా..? స్క్రిప్ట్ నీదేనా? అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. దీంతో వేదికపై ఉన్నవారంతా ఫక్కున నవ్వేశారు. ఇక ఈ కామెంట్స్ నాగశౌర్యను ఉద్దేశించే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X